ETV Bharat / state

పోలీస్​ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం: సీపీ మహేశ్​ భగవత్​ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ తాజా వార్తలు

పోలీస్​ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్​లో కొత్తగా నియామకమైన పలువురు కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపి.. విధుల్లోకి ఆహ్వానించారు.

cp mahesh bhagawath welcomes new constables
పోలీస్​ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం: సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Oct 27, 2020, 4:22 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్​లో కొత్తగా నియామకమైన 194 మంది కానిస్టేబుళ్లకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ మహేశ్​ భగవత్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లందరికీ సీపీ శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా నియామకమైన కానిస్టేబుళ్లు తమ పని విధానం ద్వారా రాచకొండ కమిషనరేట్​కు మంచి పేరు తీసుకురావాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణ ఎలా ఉండాలి, ఏం చేయాలి తదితర అంశాలను వారికి వివరించారు. పోలీసులకు క్రమశిక్షణ ముఖ్యమని తెలిపారు.

అనంతరం ఇటీవలి వర్షాలకు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, సివిల్ పోలీసులను ఇదే వేదికగా సీపీ సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా డీసీపీ నారాయణరెడ్డితో పాటు భువనగిరి, చౌటుప్పల్, యాదాద్రి ఏసీపీలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.