యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్ర ఆసుపత్రిలో 20 పడకలతో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించగా తాజాగా మరో 50 పడకలతో ఐసోలేషన్‌ను ప్రారంభించారు.
ఇప్పటివరకు జిల్లాలో 70 పడకలతో కరోనా రోగులకు చికిత్స అందనుంది. ఇంటి వద్ద హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఎయిమ్స్, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రంలో కొవిడ్-19 చికిత్స అందించనున్నారు.