ETV Bharat / state

పత్తి రైతుల వ్యథ.. కాలం అనుకూలించక చేజారిన పంట - cotton crop in yadadri bhuvanagiri district

అకాల వర్షాలు.. పత్తి రైతులకు కన్నీటిని మిగిల్చింది. పంట చేతికొచ్చే తరుణంలో అధిక వర్షాలు పడటంతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనుకున్నంత దిగుబడి రాకపోవడమే గాక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

cotton farmers lost their crop due to heavy rains and unseasonal rains
పత్తి రైతుల వ్యథ.. కాలం అనుకూలించక చేజారిన పంట
author img

By

Published : Dec 4, 2020, 3:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు సరైన దిగుబడి రాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,81,147 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయగా, 1,44,914 టన్నుల పత్తి దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ సెప్టెంబరులో కురిసిన అధిక వర్షాలతో పత్తి పంటకు నష్టం వాటిల్లడంతో దిగుబడి తగ్గడమే గాక పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, నారాయణ పూర్, గుండాల, మోట కొండూర్, అడ్డగూడూర్ మండలాల్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జూన్, జులైలో విత్తనాలు నాటి పంట ఎదిగే క్రమంలో ఆగష్టు చివరి నాటికి వర్షాలు అనుకున్న మేర కురవలేదు. సెప్టెంబర్ చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో పత్తి పూత.. కాసే దశకు చేరుకున్న తరుణంలో పూత రాలిపోయింది. వరద కాల్వలు తెగిపోయి సమీపంలో ఉన్న పత్తి పంట నీటమునిగి పంటలు దెబ్బతిన్నాయి. జాజు తెగులు, గులాబీ పురుగు.. పత్తి దిగుబడి తగ్గిపోవడానికి కారణాలయ్యాయి.

రంగు మారిన పత్తి

సాధారణంగా నల్ల రేగడిలో ఎకరానికి పత్తి 10 క్వింటాళ్లు, ఎర్ర రేగడిలో 7 క్వింటాళ్లు చొప్పున దిగుబడి రావల్సి ఉన్నప్పటికీ అంతగా దిగుబడి రాలేదు. పత్తి పంట సాగుకు ఎకరానికి రూ. 12 వేల నుంచి 15 వేలు పెట్టుబడి పెట్టామని, అనుకున్న మేర దిగుబడి రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలకు పత్తి దిగుబడి తగ్గడంతో పాటు రంగు కూడా మారడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. వరుస వర్షాలతో కొన్ని చోట్ల పత్తి పంటలో కలుపు తీయలేక పంటపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అప్పటికి ప్రారంభం కాకపోవడంతో తక్కువ రేటుకు దళారులకు అమ్మాల్సి వచ్చిందని చెప్పారు. చీడ పీడల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసినా అనుకున్న మేర దిగుబడి రాలేదని, పత్తి ఏరడానికి కూలీల ఖర్చు కూడా ఎక్కువైందని వాపోతున్నారు.

ఇదీ చదవండి: ఇతర గుర్తులతో ఉన్న ఓట్ల లెక్కింపును నిలిపివేయాలి: కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.