యాదాద్రిలో యాత్రికుల బస చేయడానికి ప్రత్యేక కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. వీటికి సంబంధించిన నమూనాల తయారీకి యాడా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. సంప్రదాయం, అధునాతన హంగులతో నిర్మాణాలు చేపట్టాలని తలచిన యాడా దిల్లీకి చెందిన ఆర్కాబ్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ సంస్థకు నమూనాల తయారీ బాధ్యతలను అప్పగించింది.
క్షేత్రాభివృద్ధిలో భాగంగా తొమ్మిది వందల (900) ఎకరాల్లో పెద్ద గుట్ట పై ఆలయ నగరి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. 250, ఎకరాల్లో లేఅవుట్ పనులు పూర్తి చేసి కాటేజీల ఏర్పాటుకు వనరులు కల్పించారు. ఆలయ నగరిలో నాలుగు రకాల కాటేజీల నిర్మాణ పనులు ఆరంభించినట్లు యాడా పేర్కొంది.
- ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?