యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు ఆరోగ్య శాఖలోని సుమారు 80 మంది సిబ్బందికి టీకా వేశారు.
ఇవాళ మరో 90 మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. యాదగిరిగుట్టలో తొలి టీకా.. మండల వైద్యాధికారికి ఇచ్చారు.
వాక్సినేషన్ కార్యక్రమాన్ని అసిస్టెంట్ కలెక్టర్ గారిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రశాంత్ పరిశీలించారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో మరో 214 కరోనా కేసులు, 2 మరణాలు