సోమవారం నుంచి మొదలు కానున్న శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యేకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రం శాసనసభ ప్రాంగణంలో ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల్లో సునీతకు నెగిటివ్ వచ్చినట్లు శాసన వర్గాలు పేర్కొన్నాయి.
ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్