ETV Bharat / state

వివాహానికి హాజరైన కరోనా బాధితురాలు.. బంధువుల్లో హై టెన్షన్!

ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడం వల్ల.. ఈ నెల 2న వైద్యులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ గా నిర్ధారించారు. ఆ మహిళ వివాహ వేడుకకు హాజరైనట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. బంధువుల వివరాలు సేకరించి క్వారంటైన్ తరలించారు.

author img

By

Published : Jun 4, 2020, 2:39 PM IST

Corona Positive for One Woman from Kollur Village
'వివాహ వేడుకకు హాజరైన.. కరోనా బాధితురాలు'

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. 38 ఏళ్ల మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్​లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల 30వ తేదీన ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడం వల్ల.. ఈ నెల 2న కరోనా పరీక్షలు చేసి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హోం క్వారంటైన్​లో బంధువులు

జిల్లా వైద్యాధికారులు.. బాధితురాలి కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నమూనా సేకరించారు. వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత మహిళ మే నెల 27న మండలంలోని ఓ గ్రామంలో వివాహ వేడుకకు హాజరైనట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వివాహానికి హాజరైన వారి వివరాలు సేకరించి క్వారంటైన్ తరలించారు.

ఇదీ చూడండి: జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.