కరోనా వైరస్ ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిపై పడింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే నారసింహుని సన్నిధి కరోనా కారణంగా వెలవెలబోతోంది. ఆలయ పరిసరాలు బోసిపోతున్నాయి. క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో యాదాద్రికి రావాలంటేనే భక్తులు జంకుతున్నారు.
యాదాద్రి ఆలయ ఉద్యోగులతో సహా.. దర్శనం కోసం వస్తున్న భక్తులు చాలామంది మాస్కులు ధరించి వస్తున్నారు. ఆలయ ఆదాయంతో పాటు దుకాణ సముదాయంలోని వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గాయి.
వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఆలయలో ప్రతి రెండు గంటలకోసారి మండపం, క్యూలైన్లను శుభ్రపరుస్తున్నారు. ఆలయంలో భక్తుల అవగాహన కోసం ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఇవాళ స్వామివారికి రూ. 4,21,110 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.
ఇవీచూడండి: 'పండగలు మళ్లీ వస్తాయి.. భక్తి గుండెల్లో ఉంటుంది'