ETV Bharat / state

మోత్కూరు మున్సిపాలిటీలో కరోనా విజృంభణ!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలం కరోనా కేసులతో గజగజ వణికిపోతున్నది. ఒక్కరోజులోనే.. మండల పరిధిలో 43 కేసులు నమోదు కావడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్​గా తేలిన అందరినీ హోం ఐసోలేషన్​కి తరలించినట్టు వైద్యులు తెలిపారు.

Corona Cases Increased In Yadadri bhuvanagiri District Mothkuru Municipality
మోత్కూరు మున్సిపాలిటీలో కరోనా విజృంభణ!
author img

By

Published : Sep 5, 2020, 7:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వెంటనే ఆమెను అంబులెన్స్​లో నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మోత్కూరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి పాజిటివ్​గా తేలింది. మండల పరిధిలోని పొడిచేడు గ్రామంలో నిర్వహించిన కొవిడ్​ నిర్ధారణ పరీక్షల్లో 75 మందిని పరీక్షించగా.. 22 పాజిటివ్​ కేసులు వెలుగు చూశాయి. ఒక్క శనివారం నాడే.. మోత్కూరు పరిధిలో 43 కేసులు నమోదైనట్టు మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కిషోర్​ కుమార్​, చైతన్య కుమార్​ తెలిపారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.