ETV Bharat / state

మోత్కూరులో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు! - మోత్కూరులో తగ్గిన కరోనా కేసులు

గత కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదైన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలక పరిధిలో ఆదివారం కరోనా కేసుల తీవ్రత తగ్గింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కరోనా ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్​ అని తేలింది. వీరికి ప్రైమరీ కాంటాక్ట్​లుగా ఉన్న వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు చేయనున్నట్టు వైద్యాధికారి చైతన్య కుమార్​ తెలిపారు.

Corona Cases Dis creased in Yadadri Bhuvanagiri District Mothkur
మోత్కూరులో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!
author img

By

Published : Sep 6, 2020, 4:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆదివారం నాడు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కరోనా ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి మాత్రమే పాజిటివ్​ అని తేలినట్లు వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో కొవిడ్​ కేసులు నమోదు కావడం వల్ల ఆందోళన చెందిన మోత్కూరు మండల పరిధిలోని ప్రజలు కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్​గా తేలిన ముగ్గురికి ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న వారిని గుర్తించి వారికి కూడా ర్యాపిడ్​ టెస్టులు నిర్వహించనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

వైరస్​ సోకిన వచ్చిన వారికి మెడికల్ కిట్స్ అందజేసి.. హోం క్వారంటైన్​లో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 1033 పరీక్షలు నిర్వహించగా196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇందులో 20 మంది పూర్తిగా కోలుకున్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. కాగా మోత్కూరు పురపాలక కేంద్రంలో వ్యాపారస్తులు గత ఆరు రోజులుగా స్వతహాగా లాక్​డౌన్ పాటిస్తూ.. వ్యాపార సముదాయాలు మూసేయడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.