లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని రాచకొండ కమిషనర్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో కళాకారులతో విచిత్ర వేషధారణతో వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు.
కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు సూచించారు. బయటకు వెళ్లిన వారు తప్పకుండా మాస్కు ధరించాలని కోరారు.