యాదాద్రి ఆలయ నిర్మాణంలో కృష్ణ శిలతో నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్‌పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. కాలి నడకన వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లోరింగ్ దోహదపడుతుంది. ఆ మేరకు ప్రత్యేక బృందంతో సీసం పూత పనులు చేపట్టారు.
మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బలిపీఠానికి రాగి తొడుగులు అమర్చారు. ధ్వజస్తంభానికి సంబంధించిన రాగి తొడుగులను త్వరలో చెన్నైకి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఆ తొడుగులకు బంగారం ఎంత మేరకు అవసరం అవుతుందనే దానిపై నివేదిక తయారు చేసి చెన్నైకి పంపనున్నట్లు సమాచారం. ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాలకు తొడుగులను ఆలయ ప్రాంగణంలోనే తయారు చేస్తున్నారు.
ఇదీ చూడండి : నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!