యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో రేషన్ డీలర్‌పై దాడి జరిగింది. సాయత్రం 6 గంటల సమయంలో సరుకులు పంపిణీ చేస్తుండగా ఇంటర్నెట్ కారణంగా బయోమెట్రిక్ ఆలస్యంగా పనిచేసినట్లు బాధితుడు తెలిపాడు. వినియోగదారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావని ప్రశ్నించిస్తూ... పక్కనే ఉన్న గాజు సీసాతో అతడిపై దాడికి పాల్పడాడు. ఈ ఘటనలో డీలర్ తలకు తీవ్ర గాయం అయ్యింది. క్షతగాత్రుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఇవీచూడండి: ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం