జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్ ని పక్కన పెట్టారని, ఫీల్డ్ అసిస్టెంట్లని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉన్నారని, విధుల్లోకి తీసుకోకపోవటం వల్ల తీవ్రమైన మానసిక వేదనతో ఐదుగురు చనిపోయారని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లో కొందరు 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో తమని క్షమించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు