యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఇదీ చూడండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్