తెలంగాణ తిరుపతిగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుండండం వల్ల అందరి దృష్టి యాదాద్రిపై పడింది. కానీ..ఇప్పుడా క్షేత్రం మరో రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఆలయంలోని కృష్ణ శిలలపై కేసీఆర్ బొమ్మను చెక్కారు. సీఎం బొమ్మ ఒక్కటే కాదు తెరాస గుర్తు అయిన కారు, ప్రభుత్వ పథకాలను పొందుపర్చారు.
ఇప్పుడిదే రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆలయ స్తంభాలపై రాజకీయ నేతలు, పార్టీ గుర్తుల చిత్రాలేంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విపక్ష నేతలు ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.