యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తమ కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం విరాళమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr Gold Donation For Yadadri) ప్రకటించారు. ఆలయ విమాన గోపురానికి భారీగా బంగారం అవసరమని సీఎం తెలిపారు. విమాన గోపురానికి 125 కిలోల బంగారం అవసరం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. విమాన గోపురానికి దాతలు బంగారం విరాళం ఇస్తామని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
'యాదాద్రికి మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తా. తొలి విరాళంగా మా కుటుంబం బంగారం విరాళమిస్తుంది. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం ఇస్తామన్నారు. మేడ్చల్ ప్రజల తరఫున మల్లారెడ్డి మరో కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 2 కిలోల బంగారం ఇస్తామన్నారు. కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. దామోదర్‌రావు కిలో బంగారం విరాళం ఇస్తామన్నారు. చాలా మంది కిలో బంగారం చొప్పున కానుక ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావం రావాలి.'
-- యాదాద్రిలో సీఎం కేసీఆర్
భూరి విరాళాలు...
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి ఆలయానికి ప్రజాప్రతినిధులు భూరి విరాళాలు ప్రకటించారు. మేడ్చల్, రంగారెడ్డి తెరాస ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. యాదాద్రి ఆలయానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు గాంధీ, హన్మంతరావు కృష్ణారావు, వివేక్ ఆనంద్ కిలో చొప్పున బంగారం విరాళం ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్‌రావు కిలో బంగారం విరాళం ప్రకటించారు. హెటిరో ఛైర్మన్ పార్థసారథి.. యాదాద్రికి 5 కిలోల బంగారం విరాళం ప్రకటించారు.
ముహూర్తం ఖరారు...
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారైంది. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నామన్న సీఎం కేసీఆర్.. అంతకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం చేయనున్నట్లు ప్రకటించారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పలుకుతామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ మూహూర్తం చినజీయర్ స్వామి నిర్ణయించారన్నారు.
ఇవీ చూడండి: Kcr Yadadri Tour: యాదాద్రిలో 10 వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం: సీఎం
CM KCR YADADRI VISIT : యాదాద్రీశుడి సన్నిధిలో సీఎం కేసీఆర్
Yadadri Temple Reopening: 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ: సీఎం కేసీఆర్
Cm Kcr on Yadadri Temple: 'మహోత్కృష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి'