యాదాద్రికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ (cji nv ramana) సతీ సమేతంగా బయలుదేరారు. యాదాద్రిలో జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి(indrakaran reddy, jagadish reddy) స్వాగతం పలకనున్నారు. అనంతరం సతీ సమేతంగా స్తంభోద్భవుడిని దర్శించుకోనున్నారు. ఉ.8.30 గం.కు యాదాద్రి చేరుకోనున్న జస్టిస్ ఎన్.వి.రమణ... ఉ.8.45కి యాదాద్రీశుడిని(sri lakshmi narasimha swamy) దర్శించుకుంటారు.
దర్శనం తర్వాత ఆలయ పునర్‌నిర్మాణ పనులను సందర్శిస్తారు. ప్రధానాలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనుల పరిశీలిస్తారు. ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ (presidential villa complex)పనులను, ఆలయ నగరిని పరిశీలించి... ఉ.10 గం.కు హైదరాబాద్‌కు జస్టిస్ ఎన్.వి.రమణ తిరుగు ప్రయాణం కానున్నారు.
ఇదీ చూడండి: యాదాద్రీశున్ని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ