యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ డైరెక్టర్ అంజనీరావు దర్శించుకున్నారు. యాదాద్రీశుడి సన్నిధికి వచ్చిన అంజనీరావుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందించారు.
ఇదీ చూడండి: తెలంగాణ రాష్ట్ర గణాంక సంకలనం-2020 విడుదల