యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రం త్వరలో పున: ప్రారంభం అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గడువులోగా తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఏప్రిల్ 15 కల్లా ఈ నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్ష జరిపారు. పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం కోసం కార్యచరణపై చర్చించారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష - యాదాద్రిపై కేసీఆర్ సమీక్ష
16:49 March 12
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష