యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. మండల కేంద్రం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి అనంతరం మౌనదీక్ష చేశారు. చేనేత కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు గర్దాసు నర్సింహ ఆధ్వర్యంలో తహశీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. కరోనా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందని నాయకులు గర్దాసు నర్సింహ అన్నారు.
గత సంవత్సరం నూలుపై ఇవ్వాల్సిన సబ్సీడీ బకాయిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. ప్రతి చేనేత కుటుంబానికి 6 నెలల పాటు, నెలకు రూ.8వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చేనేత కార్మికులు కోరారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!