ETV Bharat / state

​​ వాట్సాప్​​ గ్రూప్​ సభ్యుల దాతృత్వం - మోత్కూరు మున్సిపాలిటీ వార్తలు

గ్రామాల్లో ఉండేవారు సాధారణంగా తమ ఊరి పేరు మీద వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్​ చేసుకుంటారు. అందులో గ్రామంలోని విషయాలు, గ్రామస్థుల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే అంతటితో ఆగని యాదాద్రి జిల్లా మోత్కూర్​ వాసులు.. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ స్థానికుడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.

Help from WhatsApp group members
author img

By

Published : Jun 7, 2021, 4:39 PM IST

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని గాంధీనగర్​కు చెందిన బాషా.. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న 'మన మోత్కూర్​' వాట్సాప్​ గ్రూప్ సభ్యులు.. దాతల ద్వారా డబ్బు సేకరించారు. రూ. 55 వేల నగదును.. మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్​ చేతులమీదుగా బాధితుడికి అందించి అండగా నిలిచారు.

కరోనా సంక్షోభంలో.. 'మన మోత్కూర్​' వాట్సాప్ గ్రూప్​ సభ్యులు ఎంతో మందిని ఆదుకున్నారని మున్సిపల్ కమిషనర్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి యాదయ్య, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Viral: తేనె తెట్టెను చేతితో తొలగించిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.