Chandrayaan 3 Success Celebrations In yadadri : ఇస్రో చేపట్టిన చంద్రయన్-3 విజయవంతం కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రజలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 ప్రయోగంలో తమ పాత్ర ఉందని పెద్ద కందుకూర్‌లోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చంద్రయాన్-3 తయారీలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజీవ్ కంపెనీ ఉద్యోగుల కృషి ఉందని సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ దుర్గాప్రసాద్ తెలిపారు.
చంద్రయాన్ 3 విజయంపై ప్రపంచం హర్షం.. ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
శ్రీహరికోటలో గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ క్రింద విధులు నిర్వహిస్తున్న ప్రీమియర్ సంస్థ ఉద్యోగులు నాలుగు వందల మంది చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్నారని అన్నారు. రాకెట్ పైకి వెళ్లడానికి ఉపయోగించిన సాలిడ్ ప్రోపలెంట్ బూస్టర్లను తయారు చేసారని తెలిపారు. ఇస్రో తమకు అప్పగించిన బాధ్యతల మేరకు తమ సంస్థ ఉద్యోగులను సూళ్లూరు పేటలో రిక్యూట్మెంట్ చేసి వారిని శ్రీహరికోటలో చేర్చమన్నారు. చంద్రయన్-3 విజయవంతం కావడంలో తమ సంస్థ ఉద్యోగుల పాత్ర ఉండటం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
PM Modi ISRO Visit : 'చంద్రయాన్-3' శాస్త్రవేత్తలను అభినందించనున్న ప్రధాని.. శనివారం ఇస్రో పర్యటన
అలాగే ఇస్రో నుండి వచ్చిన అవసరాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ కంపెనీ-2 లో పీఎస్ఎల్వీ బూస్టర్స్ తయారు చేస్తున్నామని సంస్థ యాజమాన్యం తెలిపింది. తమపై నమ్మకం ఉంచి తమ సంస్థ సేవలు వినియోగించుకున్న ఇస్రో సంస్థ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇస్రో సంస్థకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే కందుకూరు గ్రామస్థులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ రాములుతో పాటు యాదగిరి గుట్ట ఎంపీపీ శ్రీశైలం హర్షం వ్యక్తం చేశారు.
Chandrayaan 3 Success Celebrations in Telangana : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టడంతో చంద్రయాన్ 3(Chandrayan-3) ప్రయోగం విజయవంతమైంది. ఈ అపూర్వ ఘట్టాన్ని కోట్లాదిమంది భారతీయులు వీక్షించారు సంబురాలు చేసుకున్నారు.. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా త్రివర్ణ పతాకాలను చేతబూని నినాదాలు చేశారు. పలుచోట్ల టపాసులు కాల్చి.. వేడుకలు జరుపుకున్నారు. చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచామని దేశభక్తి నినాదాలతో మార్మోగించారు. దేశవ్యాప్తంగా ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మానవహారాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు జయహో ఇస్రో అని వచ్చేలా మానవహారాన్ని ఏర్పాటు చేసి అభినందనలు తెలిపారు.
Chandrayaan 3 : జాబిల్లిపై 14 రోజులపాటు విక్రమ్, ప్రగ్యాన్.. అక్కడ అసలు ఏం చేస్తాయి?