యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళి గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవిష్కరించారు. అహర్నిశలు ప్రజలకు సేవలు అందించిన గొప్ప నేత చంద్రమౌళి అని ఎమ్మెల్యే సునీత కొనియాడారు.
అనంతరం గ్రామంలో స్మృతివనాన్ని గొంగిడి సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జడ్పీ ఛైర్మన్ సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, చంద్రమౌళి ఆత్మీయులు పాల్గొని నివాళులర్పించారు.
ఇదీ చదవండిః యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్