యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో సోమవారం.. కేంద్ర వైద్యవిజ్ఞాన పరిశోధకుల బృందం పర్యటించింది. ఆయుర్వేద వైద్యుడు అగ్గలయ్య శస్త్రచికిత్సలకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన శాసనాలను వారు పరిశీలించారు. దాదాపు 20 అడుగుల రాతి స్తంభంపై చెక్కిన రాతల ఆధారంగా అగ్గలయ్య చేసిన సర్జరీల ఆనవాళ్లను ముప్పై ఏళ్ల క్రితమే పరబ్రహ్మశాస్తి అనే ఎపిగ్రఫిస్ట్ గుర్తించినట్లు ఓ జర్నల్‌లో ప్రచురితమైంది.


దాాదాపు 11వ శతాబ్ధంలో చాళుక్యుల కాలంలోనే ఆయుర్వేద వైద్యుడు అగ్గలయ్య శస్త్రచికిత్సలు చేసినట్లు రాతిపై చెక్కిన శాసనాల ద్వారా తెలుస్తోందని పరిశోధకుల బృందం వెల్లడించింది. ఇలాంటి శాసనాలు భావితరాలకు ఉపయోగపడేలా డాక్యుమెంటరీ రూపొందిస్తామని తెలిపారు. స్థానిక సర్పంచ్ బీర్ల శంకర్ సహకారంతో శాసనాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.


- ఇదీ చూడండి : అవగాహన లోపం.. కొత్త కోర్సులకు దూరం!