యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో 15 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని ఆయన అన్నారు. వీటితో పోలీసులకు కేసు దర్యాప్తు సులభమవుతుందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటును సామాజిక బాధ్యతగా భావించి దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణ రెడ్డితో పాటు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలను అందించిన దాత మోహన్ రెడ్డిని డీసీపి అభినందించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ ఆదేశంతో గ్రామబాట పట్టిన అధికారులు