కరోనా ఎఫెక్ట్ యాదాద్రి ఆలయాన్ని చేరుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు ఆమె వెల్లడించారు.
నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ ఖండనాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు.. ఆలయంలో అర్చకులు శ్రీ సుదర్శన నారసింహ మహ ధన్వంతరి జప హోమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండిః 'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష