యాదాద్రి భువనగిరి జిల్లాలోని కూనూరు శివారు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లయ్య, లక్ష్మణాచారి అనే వ్యక్తులు రాయగిరి నుంచి వీరవెల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హైదరాబాద్ ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణాచారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం - బైక్ అదుపుతప్పి ప్రమాదం... ఒకరి పరిస్థితి విషమం
ఇద్దరు స్నేహితులు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నారు. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి మండలం కూనూరు సమీపంలో జరిగింది.