ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం ఆందోళ్​ మైసమ్మ దేవాలయం సమీపంలో బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

BSNL employee dies in suspicious condition in yadadri bhuvanagiri district
అనుమానాస్పద స్థితిలో బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగి మృతి
author img

By

Published : Jun 28, 2020, 10:41 PM IST

Updated : Jun 29, 2020, 12:56 AM IST

నల్గొండకు చెందిన బీఎస్​ఎన్​ఎల్​ ఉద్యోగి తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది. నల్గొండలో బీఎస్​ఎన్​ఎల్​ సంస్థలో ఈ మధ్యనే పదవీ విరమణ చేసిన షణ్ముఖచారి ఇవాళ ఉదయం ఇంట్లో నుంచి తన కారులో వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ శివారులోని ఆందోళ్ మైసమ్మ దేవాలయం పక్కన తన కారులో మృతి చెంది ఉన్నాడు.

పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి కారు డోర్ తీసి చూడగా అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించారు. కారులోనే షణ్ముఖచారి మృతదేహాన్ని దహనం చేసేందుకు యత్నించిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తానే సొంతంగా నిప్పటించుకున్నాడా?.. లేక ఎవరైనా హత్య చేసి దహనం చేసే ప్రయత్నం చేశారా?.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: 'కనిపించకుండా పోయిన అమ్మాయి శవమై తేలింది'

Last Updated : Jun 29, 2020, 12:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.