రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి మరో నలుగురికి ప్రాణం పోశారు. బ్రెయిన్ డెడ్ (Brain dead)కావడంతో అతని అవయవాలను (organs donation) దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మృతుని కుటుంబసభ్యులు. ఈనెల 3న రోడ్డు ప్రమాదంలో గాయపడిన నల్ల పరశురాములు (32) హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో(yashoda hospital in hyderabad) చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. దీంతో అతని గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు జీవన్ దాన్ సంస్థకు ఇచ్చేందుకు వారు అంగీకరించారు.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తిరుమలగిరి వైపు వెళ్తున్న లారీ వెనుక టైర్లు ఊడిపోయి నల్ల పరశురాములు (32)ను బలంగా తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోదకు తరలించారు.
యశోదా ఆస్పత్రిలో(yashoda hospital in hyderabad) చికిత్స పొందుతుండగా శరీరంలో ఛాతి కింది భాగంలో చలనం లేకపోవడం వల్ల కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో పరిస్థితిని గమనించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు. మృతుని కుటుంబసభ్యులు జీవన్ దాన్( jeevan dhan organization ) సంస్థకు అవయవాలు దానం(organs donation) చేసేందుకు ముందుకొచ్చారు. బాధితునికి భార్య, 14 నెలల బాబు, తల్లిదండ్రులు ఉన్నారు. వృద్ధ్యాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు అకాల మరణంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అవయవదాతకు అంత్యక్రియలు పూర్తి
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన నల్ల పరశురాములు (32) మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి జీవన్మమృతుడిగా నిలిచాడు. ఇవాళ అంత్యక్రియలు స్వగ్రామమైన అనాజిపురంలో జరిగాయి.
గ్రీన్ ఛానెల్ ఏర్పాటు
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను మరొకరికి అమర్చేందుకు హైదరాబాద్ పోలీసులు మరో సారి ట్రాఫిక్ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మలక్‌పేట్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 11కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో ఓ వ్యక్తి ప్రాణం నిలిచింది. అత్యవసర సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 30 సార్లు అవయవాల రవాణాను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: