యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తొమ్మిదవ రోజు రాత్రి రథోత్సవం కనుల పండువగా సాగింది. అమ్మవారిని పెండ్లాడిన నారసింహుడు లక్ష్మీసమేతుడై ప్రచార రథంలో ఆశీనులై యాదగిరిగుట్ట పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తులను తన్మయపరిచారు.
వేదపారాయణాలు, అర్చకుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం సాగింది. ఊరేగింపులో పెద్ద మొత్తంలో పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో రథోత్సవ ఊరేగింపు మహాఘట్టం ప్రశాంతంగా ముగిసింది.
ఇదీ చదవండి: అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని సీఎం ప్రకటించారు: హరీశ్