Boora Narsiah Goud clarity on resigned from TRS: తెరాస నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెరాసకు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ మేరకు రాజీనామా సంబంధించి కారణాలను వివరించారు. 2009 – 2014 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని వివరించారు.
ఆ లేఖలో బూర నర్సయ్య ఏం చెప్పారంటే... ''2014 నుంచి 2019 మధ్య భువనగిరి ఎంపీగా శక్తి వంచన లేకుండా, నియోజకవర్గ, ఇటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశాను. బడుగు బలహీన వర్గాలు సమస్యలను నేను పదే, పదే ప్రస్తావిస్తే మీరు నా పై అసహనం వ్యక్తం చేయడం ఒక ఉద్యమకారుడిగా ఎంతో బాధించింది. ఎప్పుడు ప్రజల సమస్యలు తప్ప, వ్యక్తిగత ప్రయాజనాల కొరకు మీ వద్ద పైరవీలు చేయలేదు.
Boora Narsiah Goud on kcr రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ప్రధానంగా ధరణి, జీపీ లేఅవుట్స్ రిజిస్ట్రేషన్లు నిషేధించడం, దళితుల అసైన్డ్ భూములు తీసుకోని ప్రభుత్వం లేఅవుట్స్ చేయడం, సర్పంచులకు ఉప సర్ప౦చ్ సంతకం అనే సవితి పోరు, కుల వృత్తులు సమాఖ్యలను నిర్వీర్యం చేయడం, బీసీ, ఈబీసీ పేద పిల్లలకి కేవలం 11% వరకే ఫీజు రీఇంబర్స్ ఇవ్వడం వంటి అనేక అంశాలు ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఈ విషయాన్ని మీ దృష్టికి తెద్దామంటే... అవకాశమే ఉండదని తెలిపారు. ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ స్థాయిలో కూడా తమ ఏడాది టర్నోవర్ లేదని తెలంగాణ గుత్తేదారులు భావిస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో మీతో ఏళ్ల పాటు గడిపిన సన్నిహితులు మిమ్మల్ని కనీసం నిమిషం కలవాలంటేనే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది. ఆచార్య జయశంకర్ కనీసం 6 అంగుళాల విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టకపోవడం బాధిస్తోంది'' అంటూ లేఖలో పేర్కొన్నారు.
''మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయినప్పటికీ, ఒక్క సారి కూడా మాతో సంప్రదించలేదు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు. బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం. కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణాలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానం, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతో ఇప్పుటి వరకు ఉన్నానని, కానీ అభిమానానికి, బానిసత్వానికి చాల తేడా ఉందని తెలిపారు. వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదు కానీ అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకు వచ్చే అవకాశమే లేనప్పుడు, తెరాసలోలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. తెరాసతో, మీ కుటుంబ సభ్యులతో రాజకీయ బంధం దూరమైనందుకు చింతిస్తూ, తెరాసకు రాజీనామా చేస్తున్నా...'' అని వివరించారు.
ఇవీ చూడండి: