యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ముత్యాలమ్మ దేవత బోనాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. స్థానిక విశ్వబ్రాహ్మణులు దేవతకు నైవేద్యం అందించారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. పంటలు బాగా పండాలంటూ దేవతకు మొక్కుకున్నారు.
ఇదీ చూడండి :నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె