ETV Bharat / state

'మా అమ్మను చంపింది అతనే... ఎన్​కౌంటర్​ చేయండి' - Lakshmi murder case in Yadadri

మా అమ్మను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డు సమీపంలో నిన్న సాయంత్రం హత్యకు గురైన బోలు లక్ష్మి పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మృతి చెందడంతో అనాథలుగా మారమని విలపించారు.

Bolu Lakshmi children pressmeet at bhongir
'మా అమ్మను చంపింది అతనే... ఎన్​కౌంటర్​ చేయండి'
author img

By

Published : Nov 12, 2020, 12:36 PM IST

భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చిన మృతురాలు లక్ష్మి పిల్లలు.. తన తల్లిని చంపిన నిందితుడు ఆర్య కుమార్ గౌడ్​ను ఎన్ కౌంటర్ చేయాలని మృతురాలి కొడుకు సురేష్ అన్నారు. తమ వద్దనే డబ్బులు తీసుకుని, తమని వేధింపులకు గురి చేశాడని మృతురాలి కూతుర్లు క్రాంతి, కీర్తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో రెండు సార్లు ఫిర్యాదు చేసినా మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే పోలీసులు పట్టించుకుని నిందితుడు ఆర్య కుమార్ గౌడ్​పై కేసులు నమోదు చేసి ఉంటే... ఈరోజు తన తల్లి లక్ష్మి మృతి చెందేది కాదని విలపించారు.

నిందితుడిపై కఠినమైన సెక్షన్​లతో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. వివాహేతర సంబంధం అంటూ మీడియాలో వార్తలు రావడం తమని మరింత బాధకు గురిచేసిందని మృతురాలి పిల్లలు సురేష్, క్రాంతి, కీర్తన ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.