ETV Bharat / state

24 రోజులు.. 328 కిలోమీటర్లు.. నేడే మూహుర్తం - bjp state president Bandi sanjay

Bandi Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభంకానుంది. యాదాద్రి పుణ్య క్షేత్రం నుంచి వరంగల్‌ భద్రకాళి ఆలయం వరకు 24 రోజుల పాటు యాత్ర సాగనుంది. 328 కిలోమీటర్ల మేర సాగే యాత్రను కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, కిషన్‌ రెడ్డిలు ప్రారంభించనున్నారు. ఆగస్టు 26న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగుస్తుంది.

Bandi Sanjay Padayatra
Bandi Sanjay Padayatra
author img

By

Published : Aug 2, 2022, 4:50 AM IST

Bandi Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు షురూ కానుంది. 24 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ.. 328 కిలోమీటర్ల మేర బండి పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సంజయ్‌.. ప్రత్యేక పూజలు నిర్వహించి... వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, కిషన్‌ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.

యాదాద్రిలో ప్రారంభమై వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం, ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్లనున్నారు. మరోవైపు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు సాగనుంది.

యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇవీ చదవండి: క్యాసినో కేసు నిందితులకు ముగిసిన ఈడీ విచారణ

దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.