నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై తెరాస కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇలా దాడి చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని యాదగిరిగుట్ట భాజపా మండల పార్టీ అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేనందునే.. ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో జరిగే అన్యాయాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ఆ నేతలపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేయించడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నల్లబ్యాడ్జీలు ధరించారు. రోడ్డు దిగ్బంధం చేసి భాజపా శ్రేణులు ధర్నా చేపట్టారు.