ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్‌కు భాజపా నాయకులు వినతిపత్రం అందించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. పలు గ్రామాల్లో కల్లాల్లో ధాన్యం ఉన్నపటికీ... కొనుగోలు ప్రారంభం కాలేదని తెలిపారు.
ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని భాజపా నాయకులు కోరారు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.