యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట భాజపా కార్యకర్తలు నిరుపేద ప్రజలకు ఆహారం పంపిణీ చేశారు. దాదాపు 200 ఆహార ప్యాకెట్లను ఆకలితో అలమటిస్తున్న వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోశాధికారి కాదురి అచ్చయ్య, సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాస్, చిత్తర్ల కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ పూర్తయ్యే వరకూ పట్టణంలో ఆహారం పంపిణీ చేస్తామని భాజపా నాయకులు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌ను అమల్లోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలందరూ కరోనా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం