యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్కు నిరసనసెగ తగిలింది. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా, సీపీఎం శ్రేణులు ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
పట్టణంలోని ఐబీ కార్యాలయం ఆవరణలో వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన దుకాణాలను మంత్రి ప్రారంభిస్తుండగా... ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 'అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి'