యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి రైల్వే స్టేషన్ బ్రిడ్జి వద్ద అతి వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి కింద పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వైపు వస్తున్న వీరి బైక్, రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పి కిందపడింది.
బైక్ ను నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మహిళకు తీవ్రగాయాలు కావటంతో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.