భారత్ బంద్ పిలుపుతో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య మంగళవారం గణనీయంగా తగ్గింది. కార్తీక మాసం సందర్భంగా జరగాల్సిన భక్తుల వ్రత పూజలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఆలయ పరిసరాలు, కల్యాణ కట్ట, వసతి గదుల సముదాయాలు, వ్రత మండపం, నిత్య కల్యాణం, దర్శన క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు భక్తులు లేక బోసిపోయి కనిపించాయి.
యాదాద్రి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల బస్టాండ్ ప్రాంగణం వెలవెలబోయింది. ఈ క్రమంలోనే యాదాద్రి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కాస్త ఇబ్బందులు పడ్డారు.