నలుదిశలా ఖ్యాతి పొందేలా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించే పనులు సాగుతున్నాయి. కొండపై గల ఆలయ విస్తరణ కోసం నిర్మించిన రక్షణ గోడకు సహజత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. కొండకు దక్షిణ పడమర దిశల్లో విస్తరణ పనులకు ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో కోట్లాది వ్యయంతో రక్షణ గోడలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ గోడలను భక్తులకు కనులవిందు గోలిపేలా, సహజత్వానికి అనుగుణంగా మార్చేందుకు యాడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
సరికొత్త ప్రణాళిక ద్వారా గ్రీన్ జా టెక్చర్, పెయింటింగ్‌తో తీర్చిదిద్దే పనులను చేపట్టారు. దేశంలో మరెక్కడా లేని తరహాలో సంపూర్ణంగా కృష్ణ శిలతో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టారు. నల్లరాతితో రూపొందించిన స్తంభోద్వవుడి సన్నిధి తీరులోనే రక్షణ గోడ సాదృశ్యమయ్యేందుకు కృష్ణ శిల రంగును పోలిన పెయింటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ ఈ పనులు నిర్వహిస్తోంది. సహజత్వంగా ఉండేందుకు దిల్లీకి చెందిన నిపుణుల సహకారంతో ప్రత్యేక కార్మికులు, ఎత్తైన గోడలను హంగులతో తీర్చిదిద్దినట్లు యాడా నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు..