యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో భాషా పండితులు పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న భాషాపండితులందరిని స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులుగా ఉన్నతీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో పదిహేను జారీ చేసింది. దీని ద్వారా వేలాది మంది పండితులు, పీఈటీలు ఈ ఉత్తర్వు ద్వారా లబ్ధి పొందనున్నారు. కానీ జీవో 15 అమల్లో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం భాషాపండితులు, పీఈటీల పాలిట శాపంగా మారిందన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్య పరిష్కారం కాకుండా నిలిచిపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం సంయుక్తంగా ఈనెల 12న పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. శాంతియుతంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాషా పండితులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
ఇదీ చూడండి : 8 అక్రమ మట్టి లారీలు పట్టివేత