యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల కుటుంబసమేతంగా భక్తులు తరలివచ్చి లక్ష్మీనరసింహుని దర్శించుకుని తరించారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల నుంచి రెండు గంటలన్నర సమయం వరకు పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
ఇదీ చూడండి: రూపాయికే అంతిమయాత్ర.. కరీంనగర్లో కొత్త పథకం