యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడం వల్ల స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
ఇవీ చూడండి: 'ఎవరెస్టు అధిరోహించడమే నా లక్ష్యం'