రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పోతాయిగడ్డ అంబేడ్కర్ కూడలిలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలపై జరిగే నేరాలు, మూఢ నమ్మకాలపై మోత్కూరు పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి కళాజాత బృందం సభ్యులు నృత్యాలు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భువనగిరి కళాజాత బృందానికి చెందిన బండ్ల కృష్ణ, వారి బృందం, మోత్కూరు ఎస్సై జి.ఉదయ్ కిరణ్, ఏఎస్సైలు అంకిరెడ్డి యాదయ్య, కట్ట మోహన్, ఇంద్రపెల్లి ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'జస్టిస్ ధర్మాధికారి నివేదికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి'