యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తపురం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. 13 మంది కూలీలతో వస్తున్న ఆటోకు గేదె అడ్డం రావటం వల్ల అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా... మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రయాణికులందరూ మోత్కూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఆటోలో ఉన్న కూలీలందరూ వలిగొండ మండలం నర్సయిగూడెంలో వరి కలుపు తీసి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!