ETV Bharat / state

సూపర్​ పోలీసింగ్​కు నిదర్శనంగా నిలిచిన ఆత్మకూరు పోలీసులు - Yadadri Bhuvanagiri District Latest News

రక్షక భటులంటే ప్రమాదం జరిగిన తరువాత వచ్చే వాళ్లు కాదని.. అది జరగకండా ముందు జాగ్రత్తలు చేసే వాళ్లమని చాటిచెప్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పోలీసులు. బునాదిగాని కల్వర్టుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను మట్టిపోసి పూడ్చి స్థానికుల ప్రశంసలు అందుకున్నారు.

atmakuru-police-are-digging-holes-in-the-road-on-either-side-of-the-bunadigani-culvert
రోడ్డుపై గుంతలు పూడుస్తున్న ఆత్మకూరు పోలీసులు
author img

By

Published : Feb 11, 2021, 7:13 PM IST

ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా, వారు తమ గమ్యాన్ని జాగ్రత్తగా చేరుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు పోలీసులు శ్రద్ధ వహిస్తున్నారు. రక్షక భటులంటే ప్రమాదం జరిగిన తరువాత వచ్చే వాళ్లు కాదని.. అది జరగకండా ముందు జాగ్రత్తలు చేసే వాళ్లమని చాటిచెప్తున్నారు.

ఆత్మకూర్ ఎం మండలం రహీంఖాన్​పేట వద్ద రాయగిరి-మోత్కూర్ రహదారిపై బునాదిగాని కల్వర్టుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చారు. కానిస్టేబుళ్లు నరేందర్, శ్రీనివాస్ పెట్రోలింగ్ చేస్తూ ప్రమాదాలను నివారించడానికి స్థానిక యువకులతో ఈ కార్యక్రమం చేపట్టారు.

Accompanying the soil with the young
యువకులతోపాటు మట్టి తొవ్వుతూ

రోడ్లపై గుంతలను యువత సహకారంతో మట్టిపోసి పూడ్చారు. పోలీసులు చేస్తున్న మంచి పనిని పలువురు వాహనదారులు అభినందించారు. సూపర్​ పోలీసింగ్​ అంటూ కొనియాడారు.

ఇదీ చూడండి: ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.