ETV Bharat / state

ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పాల తయారీ.. - కృత్రిమ పాల తయారీ తాజా వార్తలు

పాడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు కల్తీపాలతో మసకబారుతోంది. అక్రమ వ్యాపారులకు అడ్డాగా నిలిచింది. ధనార్జనే ధ్యేయంగా కొందరు హానికరమైన రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. వాటితో ఉప ఉత్పత్తులు పన్నీరు, కోవ, పెరుగు తదితర పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు.

Artificial milk preparation in Yadadri Bhubaneswar District
ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పాల తయారీ
author img

By

Published : Oct 8, 2020, 1:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పాల తయారీ జరుగుతుంది. వీరి పా‘పాల’తో పసిపిల్లలు మొదలు పండుముదుసలిల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇలాంటి కృత్రిమ పాలు తయారీ కేంద్రాలపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులు మాత్రం జైలుకు వెళ్లడం.. తిరిగి బయటికి వచ్చి మళ్లీ దందా కొనసాగిస్తున్నారు. మరోసారి తప్పు చేయకుండా కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తే కానీ అక్రమాలకు తెరపడదు.

కల్తీ పాలను సరఫరా చేస్తున్న ముఠాను విచారిస్తున్న డీసీపీ గిరి (దాచిన చిత్రం)

డిమాండ్‌ పెరగడంతో కాసులకు కక్కుర్తి

పసిబిడ్డల నుంచి ప్రతి ఒక్కరూ పాలు, వేడి ఛాయ్‌ తాగుతుంటారు. వీటి ఉపఉత్పత్తులైన పెరుగు, కోవా, పన్నీరు, నెయ్యి తదితరాలు జీవనంలో భాగమయ్యాయి. మిఠాయిల తయారీకి వేల లీటర్లు అవసరం. జిల్లా అవసరాలతోపాటు హైదరాబాద్‌ నగరం సమీపంలో ఉండటంతో డిమాండ్‌ పెరిగింది. గృహ యజమానులు, హోటళ్లు, మిఠాయి దుకాణాలకు రోజుకు వేల లీటర్లలో జిల్లా నుంచి పాలు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని నార్ముల్‌తోపాటు ఇతర కంపెనీలు, ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. మరికొందరు రైతులు నేరుగా అమ్ముకుంటున్నారు. డిమాండ్‌ పెరగడంతో అక్రమార్కులు కృత్రిమంగా పాలు తయారు చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కాసులు దండుకుంటున్నారు.

మచ్చుకు కొన్ని కేసులు..

భువనగిరి మండలం బీఎన్‌తిమ్మాపూర్‌ కల్తీ పాల తయారీకి కేంద్రంగా మారింది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వై.భాస్కర్‌, నర్సింహ అనే వ్యక్తులు అక్రమంగా కృత్రిమ పాలను హైదరాబాద్‌ నగరానికి తరలిస్తుండగా ఘట్‌కేసర్‌ పోలీసులు ఈనెల 5న పట్టుకున్నారు. వెన్నె తీసిన పాలు తెచ్చి పాలపొడి కలిపి ఆటో ట్రాలీలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో అవుషాపూర్‌లోని ఓ స్థావరంపై దాడిచేసి వారిద్దరిని అరెస్ట్‌ చేశారు.

  • గతంలో భువనగిరి మండలం తిమ్మాపూర్‌లో ఓ ఇంటిపై దాడిచేసి అక్రమంగా పాలు తయారు చేస్తున్న భాస్కర్‌గౌడ్‌, నరకంటి రాజును అదుపులోకి తీసుకున్నారు.
  • బీబీనగర్‌ మండలం జైనిపల్లిలో పోలీసులు దాడి చేసి 450 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
  • భువనగిరి మండలం తుక్కాపూర్‌, బొల్లేపల్లి, పోచంపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడిచేసి కృత్రిమ పాలు పట్టుకొన్నారు.
కల్తీపాల తయారీ

తయారీ ఇలా..

దశాబ్ద కాలంగా కృత్రిమ పాల తయారీ దందా సాగుతున్నా ఆహార పరిరక్షణ, స్థానిక యంత్రాంగం గుర్తించలేకపోయింది. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటయ్యాక ఎస్వోటీ దాడులతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. రసాయనం, పాలపొడి, నూనె, యూరియా, నీటి మిశ్రమాన్ని కలిపి ద్రావణాన్ని తయారు చేస్తున్నారు. ఆ ద్రావణాన్ని తక్కువ పరిణామంలో పాలు, నీటిలో కలిపి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. కొందరు వెన్న తీసిన పాలలో యూరియా కలిపి వెన్న శాతాన్ని పెంచుతున్నారు. నిజమైన పాలు వెన్న శాతం ప్రకారం లీటరు రూ.40 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద లభిస్తున్నాయి. కృత్రిమంగా తయారు చేయడం వల్ల లీటర్‌కు రూ.5 వరకు ఖర్చుతో రూ.60 వరకు విక్రయిస్తున్నారు. సాధారణ వ్యక్తులు ఎవరూ కూడా గుర్తించలేరు. మరికొందరు పాలలో మీగడ దీసి యూరియా, నూనె ప్యాకెట్లు, సర్ఫు ద్వారా కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసుల దాడుల్లో తేలింది. ఈ సోదాల్లో నూనె ప్యాకెట్లు, యూరియా, మిక్సీ, కూలింగ్‌ ఫ్రిడ్జ్‌ స్వాధీనం చేసుకున్నారు.

నిర్భయంగా ఫిర్యాదు చేయండి

పాలు నాణ్యతగా లేనట్లు అనుమానాలు ఉంటే ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్ఛు కల్తీ జరిగినట్లు వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే పాడిరైతు, పాల వ్యాపారి సమక్షంలో నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఆహార పరిరక్షణ ల్యాబ్‌కు పంపిస్తాం. అక్కడి నుంచి వచ్చిన నివేదికలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే విక్రయదారుడికి తాఖీదు ఇచ్చి కేసు నమోదు చేస్తాం. సూర్యాపేటలో గత నెలలో రెండు నమూనాలు సేకరించి ల్యాబ్‌ పంపగా ఒక దానిలో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని నివేదిక వచ్చింది. దీంతో ఆ వ్యాపారికి నోటీసు ఇచ్చాం. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకూ ఎలాంటి నమూనాలు సేకరించలేదు.-సీహెచ్‌ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌ఛార్జి ఆహార పరిరక్షణ అధికారి, యాదాద్రి భువనగిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.