యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం ఎస్వోటీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న అమ్మోనియం నైట్రేట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన చీరిక బుచ్చిరెడ్డిని హైదరాబాద్ ఉప్పల్‌లోని తన నివాసంలో అరెస్ట్ చేసినట్లు జిల్లా డీసీపి నారాయణ రెడ్డి వెల్లడించారు.
ఘటన జరిగిన రోజు నిందితులు గడ్డం కొండల్ రెడ్డి, బత్తుల నరేశ్‌ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిని ఇప్పటికే కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును చేధించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీసీపి నారాయణ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి: అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..